స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్‌

AP Governor's message on the  72nd Independence Day - Sakshi

సాక్షి, అమరావతి : ‘73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంద’ని  ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని అంకిత భావంతో కూడిన రోజుగా  జరుపుకుందామని ఆయన ఆకాక్షించారు. స్వతంత్ర  స్వేచ్ఛా ఫలాలను ఆస్వాదించడానికి ఈ రోజును అందించిన దేశ భక్తులందరినీ జ్ఞాపకం చేసుకునే గొప్ప రోజు అని కొనియాడారు.

సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలకు  అంకితమిచ్చే రోజుగా  స్వాతంత్ర్య దినోత్సవాన్ని కన్నులపండుగగా జరుపుకుందామన్నారు. ఈ పవిత్రమైన రోజున దేశ నిర్మాణానికి కారణభూతులమవుతూ  పునరంకితం అవుదామన్నారు. ఈ రోజును చిరస్మరణీయం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top