1న వలంటీర్లకు గౌరవ వేతనం

AP Government To Pays Honorary Remuneration To Grama Volunteer - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ వలంటీర్ల బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్‌ ఒకటో తేదీన గౌరవ వేతనం జమ చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో మొత్తం 1,92,848 మంది గ్రామ వలంటీర్లకు గాను 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తయిందని.. అందులో 1,50,661 మందికి గౌరవ వేతన చెల్లింపులకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందినట్టు పేర్కొన్నారు. వారికి ఒక్కొక్కరికి ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ మధ్య కాలానికి చెల్లించాల్సిన రూ.7,500 గౌరవ వేతనం అక్టోబర్‌ 1న వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు పేర్కొన్నారు. వివిధ సాంకేతిక కారణాలు, సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించని వలంటీర్ల గౌరవ వేతనం సప్లిమెంటరీ బిల్‌ ద్వారా మిగిలిన అందరికీ అక్టోబర్‌ మొదటి వారంలో జమ చేస్తామని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top