ఏపీలో రూ.1000 ఆర్థిక సహాయం పంపిణీ  | AP Government distribute cash relief by grama volunteers | Sakshi
Sakshi News home page

ఏపీలో ప్రారంభమైన రూ.1000 ఆర్థిక సహాయం పంపిణీ 

Apr 4 2020 9:04 AM | Updated on Apr 4 2020 12:49 PM

AP Government distribute cash relief by grama volunteers - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1000 పంపిణీ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచే గ్రామ వాలంటీర్లు ఇంటింటీకి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాలంటీర్లు ఇంటింటికీ ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి పేదలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీంతో కోటి 30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందనుంది. (వ్యవ'సాయం' ఆగొద్దు)

కాగా  కరోనా వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే లాక్‌డౌన్‌ వల్ల పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. పేదలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో వారికి ఉచితంగా బియ్యం, కందిపప్పుతోపాటు ఒక్కో కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1,000 చొప్పున నగదు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. (కరోనా: ఇంటింటి సర్వేపై సీఎం జగన్ ఆరా)

ఇందులో భాగంగానే మొదటి విడతగా గత నెల 29 నుంచి పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నారు. నేడు (శనివారం) బియ్యం కార్డులున్న 1.30 కోట్ల కుటుంబాలకు ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా రూ.వెయ్యి చొప్పున నగదు సాయం అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలందరికీ ఈ ప్రత్యేక సాయం అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యం. (క్షణక్షణం.. అప్రమత్తం)

పేదలకు ఆర్థిక సహాయానికి 1300 కోట్లు విడుదల

  • శ్రీకాకుళం జిల్లాలో 7.5 లక్షల మందికి 75.06 కోట్లు పంపిణీ
  • విజయనగరం జిల్లాలో 6.47 లక్షల మందికి 64.79 కోట్లు పంపిణీ
  • విశాఖ జిల్లాలో 11.05 లక్షల మందికి 110.56 కోట్లు పంపిణీ
  • తూ.గో.జిల్లాలో 14.65 లక్షల మందికి 146.54 కోట్లు పంపిణీ
  • ప.గో.జిల్లాలో 11.44 లక్షల మందికి 114.48 కోట్లు పంపిణీ
  • కృష్ణా జిల్లాలో 11.21 లక్షల మందికి 112.10 కోట్లు పంపిణీ
  • గుంటూరు జిల్లాలో 12.87 లక్షల మందికి 128.70 కోట్లు పంపిణీ
  • ప్రకాశం జిల్లాలో 8.76 లక్షల మందికి 87.66 కోట్లు పంపిణీ
  • నెల్లూరు జిల్లాలో 7.76 లక్షల మందికి 77.69 కోట్లు పంపిణీ
  • చిత్తూరు జిల్లాలో 9.92 లక్షల మందికి 99.21 కోట్లు పంపిణీ
  • అనంతపురం జిల్లాలో 10.67 లక్షల మందికి 106.79 కోట్లు పంపిణీ
  • కర్నూలు జిల్లాలో 10.56 లక్షల మందికి 105.67 కోట్లు పంపిణీ
  • వైఎస్ఆర్ జిల్లాలో 7.06 లక్షల మందికి 70.69 కోట్లు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement