రామరాజ్యం తలపించేలా.. రాజన్న రాజ్యం

AP CM YS Jagan Mohan Reddy 6 Months Of Journey And Supporting Schemes - Sakshi

రామరాజ్యం తలపించేలా.. రాజన్న రాజ్యం స్ఫూర్తిగా.. సువర్ణయుగం దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆరునెలల్లోనే పాలనలో తనదైన ముద్ర వేసిన ఆయన ఆరుగాలం సంక్షేమ సేద్యం చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. అన్నివర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు. అందుకే ప్రజలంతా ముక్తకంఠంతో జయహో జగన్‌ అంటూ నినదిస్తున్నారు.   

సాక్షి, ఏలూరు: పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండడుగులు వేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. గత ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మళ్లీ ఎన్నికలు వచ్చేదాక పట్టించుకోలేదు. దీనికి భిన్నంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆరునెలల్లోనే చర్యలు చేపట్టారు వైఎస్‌ రైతు భరోసా వంటి పథకాలను సంతృప్తస్థాయిలో జయప్రదం చేశారు. దశలవారీ మద్యపాన నిషేధం, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ సేవలు విస్తృతం, ఫీజురీయింబర్స్‌మెంట్, కాపునేస్తం తదితర పథకాల అమలుకు ముందడుగు వేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి శరవేగంగా కసరత్తు జరుగుతోంది.  

చెప్పనివీ చేశారు..
గతంలో ఒక పథకం ప్రారంభించాలి అంటే రోజుల తరబడి ప్రచారం.. కాగితాలను దాటి వాస్తవానికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు.  ఇప్పుడు చూస్తే  ఒక పథకం అమలు ప్రారంభమై జనాల్లోకి వెళ్లే సరికే మరో పథకంతో ముందుకు వస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన పథకాలు, అందిన లబ్ధి రాయాలంటే పెద్ద చిట్టా అవుతుంది. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలవుతున్నాయి.   

ఏలూరు నుంచే వాహన మిత్రకు శ్రీకారం  
ఏలూరులో హామీ ఇచ్చిన విధంగా ఆటోడ్రైవర్లకు, క్యాబ్‌ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద ఏడాదికి పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని జిల్లా నుంచే ప్రవేశపెట్టారు. జిల్లాలో  వాహన మిత్ర పథకంలో దరఖాస్తు చేసుకున్నవారు 16,390 మంది వరకూ ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం వారి ఖాతాల్లో తొలి విడత ఆర్థికసాయం కింద రూ. 10 వేలు చొప్పున నిధులు జమచేసింది. జిల్లా వ్యాప్తంగా రైతుభరోసా ద్వారా వ్యవసాయ అధికారులు 6,29,494 రైతు ఖాతాలను గుర్తించారు. వీరిలో 3,23,412 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఇంకా 13 వేల మందికి బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ సీడింగ్‌ పూర్తిస్థాయిలో నమోదు కాకపోవడం వల్ల చెల్లింపులు నిలిచాయి. జిల్లాలోని వివిధ రకాల పెన్షన్‌దారులకు నెలకు మొత్తం రూ.95 కోట్ల వరకూ చెల్లించేవారు. తాజాగా వైఎస్‌ జగన్‌ పెన్షన్‌ పెంపుదల కారణంగా ఈ మొత్తం రూ.105 కోట్లకు చేరు కుంది. దీంతో ఒక్క పశి్చమగోదావరి జిల్లాలోని లబి్ధదారులకే నెలకు రూ. 10 కోట్ల మేరకు అదనపు లబ్ధి చేకూరింది. 

మద్య నిషేధం వైపు అడుగులు 
మద్య నిషేదంవైపు అడుగులు పడుతున్నాయి.  జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 38 బార్లు ఉండగా, వాటిని 25కు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో గతంలో 474 మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తులు నిర్వహించగా వాటిని 20శాతం తగ్గించి 374 ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలు పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం కింద  జిల్లాలోని 5. 40 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమికంగా నేత్ర పరీక్షలు నిర్వహించారు. వారిలో 32,581 మంది విద్యార్థులు వివిధ నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మన బడి నాడు – నేడు తొలి విడతగా జిల్లాలోని 24 మండలాలు, 4 మున్సిపాలిటీల నుంచి రిసోర్స్‌ పర్సన్‌లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వచ్చే మూడేళ్ళలో జిల్లాలోని 4469 స్కూళ్ళను అభివృద్ధి చేయనున్నారు. తొలి విడతలో 1058 పాఠశాలలను ఎంపిక చేశారు.  ఉన్నత విద్య అభ్యసించే ప్రతీ విద్యార్థి తల్లి ఖాతాకు రూ. 20 వేలను జమ చేసే విధంగా అమలు చేసే జగనన్న విద్యాదీవెన పథకంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 90 వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు, మరో 28 వేల మంది  డిగ్రీ విద్యార్థులు, 8 వేల మంది పీజీ విద్యార్థులతోపాటు మరో 20 వేల మంది ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.  

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం  
జిల్లా వ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు లక్షా 5 వేల మంది ఉన్నారు. వారిలో తొలిదశలో రూ.10 వేలు బాండ్లు చెల్లిం చేందుకు ప్రభుత్వం రూ. 34 కోట్లు విడుదల చేసింది. దీనిలో సుమారు 34 వేల మంది బాధితులకు లబ్ధి చేకూరుతోంది. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కలి్పంచడం పట్ల అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.  

మహిళలకు సగం పదవులు  
జిల్లాలోని 19 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ) చైర్మన్‌ పదవుల్లో  10 మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులు మహిళలకు దక్కనున్నాయి. ఇక దేవాలయాల ట్రస్ట్‌బోర్డులు, వ్యవసాయ సహకార పరపతి సంఘాలు వంటి వాటికి కూడా రిజర్వేషన్లు అమలుకానుండడంతో ఎంతోమంది పదవులు దక్కించుకుని రాజకీయంగా సత్తాచాటే అవకాశం ఏర్పడింది. జిల్లాలో  మత్స్యకార భరోసా పథకం కింద  1120 మందిని లబి్ధదారులను గుర్తించారు. మొదటి విడతగా 520 మందికి  నేరుగా బ్యాంకు ఖాతాల్లో రూ 10వేలు జమచేశారు.  వైఎస్సార్‌ ఆసరా కింద జిల్లాలోని డ్వాక్రా మహిళలకు రూ.2,420 కోట్ల మేరకు లబ్ధి చేకూరనుంది.  ఇవే కాకుండా అక్వా రైతులకు విద్యుత్‌ రాయితీ, లా నేస్తం వంటి అనేక పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టు మళ్లీ వేగం పుంజుకుంది. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.  

ఆధునిక వైద్యకళాశాలకు శంకుస్థాపన  
ఏలూరు నగరంలో రూ.266 కోట్ల వ్యయంతో  ఏర్పాటు చేసే ఆధునిక ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రతి పేదవానితోపాటు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సైతం ఆరోగ్య భద్రత కలి్పస్తున్నారు. తాజాగా డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్‌ చేయించుకున్న బాధితులకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అనంతరం విశాంత్రి సమయంలో ప్రతినెలా రూ.5వేలు రోగి ఖాతాలో జమ చేసేలా ప్రత్యేక జీఓ జారీ చేశారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల ఆపరేషన్లు చేయించుకున్న రోగులకు ఈ పథకం వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శ్రీ కార్డులు పొందేందుకు ఆదాయం పరిమితిని రూ.5లక్షల వరకూ పెంచారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ముందుగా పశి్చమగోదావరి జిల్లా నుంచే పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తున్నారు.   

ఆరుగాలం సంక్షేమం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top