విశాఖ బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌ | AP CM YS Jagan Going To Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌

Sep 28 2019 9:50 AM | Updated on Sep 28 2019 10:11 AM

AP CM YS Jagan Going To Visakhapatnam - Sakshi

సాక్షి, గన్నవరం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ బయల్దేరి వెళ్లారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బలిరెడ్డి సత్యారావు భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. బలిరెడ్డి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు.

చదవండిదివికేగిన దిగ్గజం.. రాజకీయ ప్రస్థానం 

మంచి నాయకుడిని కోల్పోయాం: ఉమ్మారెడ్డి
సాక్షి, గుంటూరు: మరోవైపు బలిరెడ్డి సత్యారావు మృతి పట్ల వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యారావు మృతి పార్టీకి తీరని లోటు అని, మంచి నాయకుడిని కోల్పోయామని అన్నారు. బలిరెడ్డి సత్యారావుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన చివరిదాకా ప్రజల కోసమే పని చేశారంటూ, సత్యారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement