రెండోవిడత రుణమాఫీలోనూ గందరగోళం | AP cm chandrababu naidu keeps confusing farmers on loan waiver | Sakshi
Sakshi News home page

రెండోవిడత రుణమాఫీలోనూ గందరగోళం

Mar 28 2015 1:24 PM | Updated on Oct 1 2018 2:00 PM

ఆంధ్రప్రదేశ్లో రెండో విడత రుణమాఫీలోనూ గందరగోళం నెలకొంది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో రెండో విడత రుణమాఫీలోనూ గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం  బ్యాంకులకు ఆ జాబితాలను పంపింది. రెండో విడత రుణమాఫీకి 11లక్షల 27వేల ఖాతాలు ఎంపిక చేసింది. ఒక్క బ్యాంకులో ఒక ఖాతాకే రుణమాఫీకి అవకాశం ఉంది. దాంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. భార్యా, భర్తల పేరిట వేర్వేరుగా ఖాతాలున్నా 20శాతం వరకే మాఫీ వర్తిస్తుంది. 
 
మొత్తం రైతు ఖాతాలు కోటీ 15 లక్షలు ఉండగా బ్యాంకులు అప్లోడ్ చేసింది కేవలం 82లక్షల 66వేల ఖాతాలు మాత్రమే.  దాంతో 51 లక్షల 70వేల ఖాతాలకు మాత్రమే అర్హత ఉండగా, సుమారు 30 లక్షల ఖాతాలకు చంద్రబాబు సర్కార్ మొండిచేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి తొలి విడతలో రూ.4,680కోట్లు విడుదల చేయగా, రెండో విడతలో రూ.2,315 కోట్లు విడుదల చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement