మూడు రోజుల పాటు అసెంబ్లీ

AP Assembly should be held  for three days  - Sakshi

శాసన మండలి రెండు రోజులు.. బీఏసీలో నిర్ణయం

సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడు రోజులు, శాసనమండలి సమావేశాలు రెండు రోజులు నిర్వహించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం అసెంబ్లీ కార్యాలయంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు శాసనసభ నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అధికారపార్టీ పేర్కొనగా, వాటిని వ్యతిరేకిస్తామని తెలుగుదేశం పార్టీ తెలిపింది.

మండలి చైర్మన్‌ షరీఫ్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో మంగళవారం, బుధవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అధికారపార్టీ నుంచి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పాల్గొనగా ప్రతిపక్ష పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో అధికారపార్టీ ప్రతిపాదించిన ధరల స్థిరీకరణ నిధి, ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదించిన రాజధాని ఉద్యమం అంశాలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top