ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 18వతేదీ నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు జరగనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావే శాలు డిసెంబర్ 18వతేదీ నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. మంగళవారం సీఎం చంద్రబాబునాయుడుతో చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు వెంకట సురేష్ సమావేశమై అసెంబ్లీ నిర్వహణ తేదీలపై చర్చించారు. 18వ తేదీన సమావేశాలు ప్రారంభమవుతాయి. 23వ తేదీ వరకు అంటే ఐదు రోజుల పాటు సభ జరపాలని నిర్ణయించారు.