మరో విద్యార్థి బలవన్మరణం

మరో విద్యార్థి బలవన్మరణం - Sakshi

  • పునాదిపాడు పరిధిలోని కార్పొరేట్ కాలేజీలో ఘటన

  •  మృతుడి స్వస్థలం చిత్తూరు జిల్లా పీలేరు

  •  సహచరులు పరీక్ష రాస్తుండగా గదికి వచ్చి ఆత్మహత్య

  • కంకిపాడు :  మండలంలోని పునాదిపాడు పరిధిలోగల ఓ కార్పొరేట్ కళాశాల హాస్టల్‌లో గురువారం ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణాలు తెలియలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన తరికొండ అశోక్‌కుమార్(17) పునాదిపాడు పరిధిలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే సంస్థకు చెందిన గొల్లపూడి శాఖలో జూని యర్ ఇంటర్ చదివి, రెండో సంవత్సరం ఇక్కడకు వచ్చాడు.



    కళాశాల ప్రాంగణంలోని హాస్టల్‌లో ఉంటున్నాడు. రోజూ మాదిరి గానే అశోక్ నిద్ర లేచాక స్నానాదికాలు ముగించుకుని  రూమ్‌మేట్స్‌తో కలిసి బయటకు వచ్చాడు. కొంతసేపటి తరువాత రూమ్‌కు తిరిగి వచ్చాడు. అతడి రూమ్‌మేట్స్ కళాశాలలో జరి గే వారాంతపు పరీక్షకు హాజరయ్యారు. అశోక్ దీనికి హాజరు కా లేదు. దీంతో అధ్యాపకులు, సహచర విద్యార్థులకు అనుమానం వచ్చి ప్రాంగణంలో వెదికారు.



    రూమ్‌కు వచ్చి చూడగా.. దుప్పటితో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయి ఉన్నాడు. డీన్ రవీంద్రకుమార్ అందజేసిన సమాచారం తో కంకిపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్.జె.రవికుమార్, ఎస్‌ఐ జి.శ్రీనివాస్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. అశోక్‌కుమార్‌తో కలిసి రూమ్‌లో ఉం టున్న ఐదుగురు విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. అశోక్ తండ్రి మల్లికార్జున్‌కు సమాచారం అందించారు.

     

    కన్నీరు మున్నీరైన సోదరి



    అశోక్ చదువుతున్న కళాశాలకు సమీపంలోని మరో శాఖలో అతడి అక్క లీలావతి ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. కళాశాల సిబ్బంది ఈ ఘటన గురించి ఆమెకు తెలియజేసి, ఘటనాస్థలికి తీసుకువచ్చారు. తమ్ముడి మృతదేహాన్ని చూసి ఆమె గుండెలవిసేలా రోదించింది. తమ్ముడి బలవన్మరణంతో లీలావతి పడుతున్న వేదన చూపరుల కంటతడి పెట్టించింది.

     

    ఘటనాస్థలిని పరిశీలించిన ఏసీపీ



    అశోక్ ఆత్మహత్య చేసుకున్న గదిని ఈస్ట్‌జోన్ ఏసీపీ ఉమామహేశ్వరరాజు పరిశీలించారు. కాలేజీ సిబ్బంది నుంచి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గదిలో ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకుని సమగ్ర పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

     

    చదువులో ఒత్తిడి భరించలేకేనా?



    అశోక్ ఆత్మహత్య వెనుక కారణాలు తెలియడం లేదు. ఇంటర్ మొదటి సంవత్సరంలో  400 మార్కులు సాధించాడు. చదువులో విపరీతమైన ఒత్తిడి ఆత్మహత్యకు కారణమై ఉంటుందా? అనే అనుమానం ప్రధానంగా వ్యక్తమవుతోంది. లేక ఇంకేదైనా కారణం ఉందా? అని కూడా అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో ఓ పెన్ను, నలిపి వేసిన పేపర్ పడి ఉన్నాయి. అయితే అందు లో ఏమీ రాయలేదు. ఆత్మహత్యకు కార ణం పుస్తకాల్లో రాసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top