అంగన్‌వాడీల వయోపరిమితి పెంపు | anganwadi's age limit | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల వయోపరిమితి పెంపు

May 30 2015 4:59 PM | Updated on Sep 19 2018 8:32 PM

సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు వయోపరిమితిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న అంగన్‌వాడీలకు శుభవార్త. అంగన్ వాడీ కార్యకర్తలకు, సహాయకులకు వయోపరిమితిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  వారి గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 

అరవై ఏళ్లు పూర్తయిన అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 50 వేలు, సహాయకులకు రూ.20 వేలను పదవీ విరమణ ప్రయోజనంగా ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement