అంగన్‌వాడీల చలో హైదరాబాద్ భగ్నం | anganwadi workers arrest | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల చలో హైదరాబాద్ భగ్నం

Mar 16 2015 5:51 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం అరెస్టు అయ్యారు.

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ లోని అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి అడగడునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సోమవారం పలు ప్రాంతాల్లోని కార్యకర్తలను ముందుగా అరెస్ట్ చేసి వారి చేపట్టిన హైదరాబాద్ కార్యక్రమానికి పోలీసులు భగ్నం కల్గించారు. తమ సమస్యలను  పరిష్కిరించాలని కోరుతూ మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలివెళుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి రైల్వే స్టేషన్‌లలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. స్వల్ప తోపులాట జరగడంతో ఐద్వా నాయకురాలు శ్రీదేవి సొమ్మసిల్లి పడిపోయారు.

 


కాగా తూర్పుగోదావరి జిల్లాలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలు దేరిన 50 మంది అంగాన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరలో సోమవారం చోటుచేసుకుంది. కనీస వేతనాలను  చెల్లించాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి అంగన్‌వాడీలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement