రాష్ట్రాన్ని రక్తాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రాన్ని రక్తాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఏకంగా ముఖ్యమంత్రే హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం దారుణమని, మీకు అధికారం ఇచ్చింది రౌడీయిజం, గుండాగిరి చేయడానికా అని ఆయన ప్రశ్నించారు. వంగవీటి మోహనరంగా హత్య నుంచి అన్ని హత్యలపై చర్చకు తాము సిద్ధమని, అధికారపక్షం సిద్ధమా అని ప్రశ్నించారు.
ప్రజల కోసం చేసే ఏ మంచి పనికైనా తాము సహకరిస్తామని చెవిరెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యలకు, దాడులకు గురైన వారి జాబితాను స్పీకర్‌కు అందజేస్తామని ఆయన చెప్పారు. పరిటాల రవి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరగానే మంచోళ్లయ్యారా అంటూ ప్రశ్నించారు.