రేపు ఏపీ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు | Andhra pradesh inter 1st, 2nd year results March 2017 Releasing on 13th April | Sakshi
Sakshi News home page

రేపు ఏపీ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు

Apr 12 2017 10:04 AM | Updated on Aug 18 2018 9:23 PM

రేపు ఏపీ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు - Sakshi

రేపు ఏపీ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు

ఏపీ ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.

అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలోని గేట్‌వే హొటల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి పేర్కొన్నారు.
 
ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్‌, వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి ఒకటో తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 10,31,285 మంది రాశారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. 1,445 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. గత ఏడాదికన్నా ఈసారి పరీక్ష ఫలితాలను వారం రోజులు ముందుగా విడుదల చేస్తుండడం విశేషం. పరీక్ష ఫలితాలను ‘సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌’లో చూసుకోవచ్చు.
 
ఈ సేవ, మీసేవ, రాజీవ్‌ సిటిజన్‌ సర్వీస్‌సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్‌ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్‌ జనరల్‌ ఫలితాలకు 54242కు ఐపీఈ1 స్పేస్‌ హాల్‌టిక్కెట్‌ నెంబర్‌ పంపాలి. సెకండియర్‌ జనరల్‌ ఫలితాలకు ఇదే నెంబర్‌కు ఐపీఈ2 స్పేస్‌ ఇచ్చి హాల్‌టిక్కెట్‌ నెంబర్‌ పంపించాలి. 5676750 నెంబర్‌కు ఎస్సెమ్మెస్‌ పంపి సమాచారం తెలుసుకోవచ్చని బోర్డు పేర్కొంది. 
 
మరోవైపు తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను ఈ నెల 17న విడుదల చేయాలని ఇంటర్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ఈ నెల 27న విడుదల చేయాలని భావించినా జేఈఈ ఫలితాలను విడుదల చేస్తుండడంతో ఇంటర్ ఫలితాలను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. బుధవారం ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ పూర్తికానున్నది. 17న ఫలితాలను విడుదల చేస్తామని, సాంకేతిక సమస్యలు తలెత్తితే 18న ప్రకటిస్తామని బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement