‘ఏపీ బ్రాండ్‌ థాన్‌’ ఎంట్రీలకు ఆహ్వానం: ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Government Invites AP Brandathon Logo Design Entries - Sakshi

సాక్షి, అమరావతి : పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్‌ ఇమేజ్‌ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘ఏపీ బ్రాండ్‌ థాన్‌’ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్ రూపొందించే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తోంది. ఇందుకోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఆసక్తికలిగిన వారు తమ ఎంట్రీలను అక్టోబర్‌ 28 రాత్రి 11 గంటల వరకు ప్రభుత్వ వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అత్యున్నతమైన మూడు ఎంట్రీలకు నగదు పురస్కారాలు అందజేస్తామని తెలిపింది. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.25 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఇటీవలే ‘ఏపీ బ్రాండ్‌ థాన్‌’  పోస్టర్‌ను మంత్రి ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి ఆవిష్కరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top