మీదే బాధ్యత.. కాదు మీదే బాధ్యత! | Andhra Pradesh DGP, CISF DG Comments | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ వాదులాట

Oct 25 2018 8:16 PM | Updated on Oct 25 2018 9:55 PM

Andhra Pradesh DGP, CISF DG Comments - Sakshi

సీవీ ఆనంద్‌, ఆర్పీ ఠాకూర్‌

విమానాశ్రయంలో అందరూ చూస్తుండగా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

సాక్షి, విశాఖపట్నం: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో అందరూ చూస్తుండగా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కోడి పందేలకు వాడే పదునైన కత్తితో జననేతపై దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించింది. భద్రతా వైఫల్యంతో విపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే పోలీసులు, కేంద్ర పరిశ్రమల రక్షణ దళం (సీఐఎస్‌ఎఫ్‌) ఉన్నతాధికారులు మాత్రం బాధ్యతారహితంగా సమాధానమిచ్చారు. రక్షణ బాధ్యత తమది కాదంటే తమది కాదని దోబూచులాడుతున్నాయి. భద్రతా వైఫ్యలమే లేదన్నట్టుగా బీరాలు పలికారు.

మాకు సంబంధం లేదు: డీజీపీ
విమానాశ్రయంలో భద్రత పర్యవేక్షణ అంతా సీఐఎస్‌ఎఫ్‌ పరిధిలో ఉంటుందని, తమకు సంబంధం లేదని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ స్వయంగా విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎయిర్‌పోర్టు లోపల తమకు పని లేదని, అక్కడ ఏం జరిగినా సీఐఎస్‌ఎఫ్‌ చూసుకుంటుందని అన్నారు. విమానాశ్రయంలోని కత్తిని ఎలా తీసుకెళ్లారనేది దర్యాప్తులో తేలుస్తామన్నారు. సీఐఎస్‌ఎఫ్‌ రిపోర్ట్‌ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

మాకేం పట్టింది: సీఐఎస్‌ఎఫ్‌ డీజీ
సీఐఎస్‌ఎఫ్‌ డీజీ సీవీ ఆనంద్‌ మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, తమ వైఫల్యం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు. ఎంట్రన్స్‌ దగ్గర ఎవరైనా లోపలికి వెళ్లొచ్చని పేర్కొన్నారు. తమ సిబ్బంది ప్రయాణికుల గుర్తింపు కార్డులు, టిక్కెట్లు మాత్రమే పరిశీలిస్తారని చెప్పారు. లగేజీ చెక్‌ చేయరని అన్నారు. ప్రయాణికుల వ్యక్తిగత భద్రత తమ పరిధిలోకి రాదని, చెక్‌ ఇన్‌ ఏరియాకు ఎవరైనా వెళ్లొచ్చని వివరించారు. ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇదే పద్ధతి కొనసాగుతోందన్నారు. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి ఏఈపీ పాస్‌ ఉంటుందని, వీరిని చెక్‌ చేయమని వెల్లడించారు. ఎంట్రన్స్‌ దగ్గర ఎవరైనా లోపలికి వెళ్లొచ్చని, దీనిపై ఏవివేయన్‌ సెక్యురిటీ సెమినార్‌లోనూ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆనంద్‌ తెలిపారు.

పోలీసుల ద్వంద్వ వైఖరి
పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ కప్పదాటు వైఖరిపై వైఎస్సార్‌ సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీరు సరిగా లేదని మండిపడుతున్నారు. వైఎస్‌ జగన్‌పై ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం తమ పరిధిలోనికి రాదని చెబుతున్న​ డీజీపీ.. గతంలో ప్రత్యేక హోదా ర్యాలీ కోసం విశాఖపట్నం వెళ్తున్నప్పుడు వైఎస్‌ జగన్‌ను ఎయిర్‌పోర్టు రన్‌వే పోలీసులు అడ్డుకున్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడొ​క న్యాయం, ఇప్పుడొక న్యాయమా అని నిలదీస్తున్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించేలా డీజీపీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి సూత్రధారులను కోర్టు బోనెక్కించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు: 

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం!

సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు..

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం; లోతైన దర్యాప్తు

పథకం ప్రకారమే వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం!

‘ఎయిర్‌పోర్టులోకి కత్తులు అనుమతిస్తారా?’

ది పిరికిపందల చర్య: ఓవైసీ

నిందితుడి జేబులో లెటర్‌ : పథకం ప్రకారమే దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement