ఇది పిరికిపందల చర్య: ఓవైసీ | MIM Leader Asaduddin Owaisi Condemns Attack On YS Jagan In Vizag Airport | Sakshi
Sakshi News home page

ఇది పిరికిపందల చర్య: ఓవైసీ

Oct 25 2018 2:41 PM | Updated on Oct 25 2018 2:41 PM

MIM Leader Asaduddin Owaisi Condemns Attack On YS Jagan In Vizag Airport - Sakshi

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ

హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. వైఎస్‌ జగన్‌పై దాడి పూర్తిగా భద్రతా వైఫల్యమేనని పేర్కొన్నారు.

విమానయాన శాఖా మంత్రి సురేష్‌ ప్రభు దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఒక మనిషి కత్తితో ఎయిర్‌పోర్టు లోపలికి ఎలా వెళ్లగలిగాడని అనుమానం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కూడా వీఐపీలకు భద్రత లేకుంటే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement