breaking news
CISF official
-
ఏపీ పోలీసులు, సీఐఎస్ఎఫ్ వాదులాట
-
మీదే బాధ్యత.. కాదు మీదే బాధ్యత!
సాక్షి, విశాఖపట్నం: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో అందరూ చూస్తుండగా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కోడి పందేలకు వాడే పదునైన కత్తితో జననేతపై దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించింది. భద్రతా వైఫల్యంతో విపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే పోలీసులు, కేంద్ర పరిశ్రమల రక్షణ దళం (సీఐఎస్ఎఫ్) ఉన్నతాధికారులు మాత్రం బాధ్యతారహితంగా సమాధానమిచ్చారు. రక్షణ బాధ్యత తమది కాదంటే తమది కాదని దోబూచులాడుతున్నాయి. భద్రతా వైఫ్యలమే లేదన్నట్టుగా బీరాలు పలికారు. మాకు సంబంధం లేదు: డీజీపీ విమానాశ్రయంలో భద్రత పర్యవేక్షణ అంతా సీఐఎస్ఎఫ్ పరిధిలో ఉంటుందని, తమకు సంబంధం లేదని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్వయంగా విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎయిర్‌పోర్టు లోపల తమకు పని లేదని, అక్కడ ఏం జరిగినా సీఐఎస్ఎఫ్ చూసుకుంటుందని అన్నారు. విమానాశ్రయంలోని కత్తిని ఎలా తీసుకెళ్లారనేది దర్యాప్తులో తేలుస్తామన్నారు. సీఐఎస్ఎఫ్ రిపోర్ట్ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. మాకేం పట్టింది: సీఐఎస్ఎఫ్ డీజీ సీఐఎస్ఎఫ్ డీజీ సీవీ ఆనంద్ మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, తమ వైఫల్యం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు. ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా లోపలికి వెళ్లొచ్చని పేర్కొన్నారు. తమ సిబ్బంది ప్రయాణికుల గుర్తింపు కార్డులు, టిక్కెట్లు మాత్రమే పరిశీలిస్తారని చెప్పారు. లగేజీ చెక్ చేయరని అన్నారు. ప్రయాణికుల వ్యక్తిగత భద్రత తమ పరిధిలోకి రాదని, చెక్ ఇన్ ఏరియాకు ఎవరైనా వెళ్లొచ్చని వివరించారు. ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇదే పద్ధతి కొనసాగుతోందన్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఏఈపీ పాస్ ఉంటుందని, వీరిని చెక్ చేయమని వెల్లడించారు. ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా లోపలికి వెళ్లొచ్చని, దీనిపై ఏవివేయన్ సెక్యురిటీ సెమినార్‌లోనూ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆనంద్ తెలిపారు. పోలీసుల ద్వంద్వ వైఖరి పోలీసులు, సీఐఎస్ఎఫ్ కప్పదాటు వైఖరిపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీరు సరిగా లేదని మండిపడుతున్నారు. వైఎస్ జగన్‌పై ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం తమ పరిధిలోనికి రాదని చెబుతున్న డీజీపీ.. గతంలో ప్రత్యేక హోదా ర్యాలీ కోసం విశాఖపట్నం వెళ్తున్నప్పుడు వైఎస్ జగన్‌ను ఎయిర్‌పోర్టు రన్‌వే పోలీసులు అడ్డుకున్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడొక న్యాయం, ఇప్పుడొక న్యాయమా అని నిలదీస్తున్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించేలా డీజీపీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి సూత్రధారులను కోర్టు బోనెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సంబంధిత కథనాలు: వైఎస్ జగన్‌పై హత్యాయత్నం! సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం; లోతైన దర్యాప్తు పథకం ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం! ‘ఎయిర్‌పోర్టులోకి కత్తులు అనుమతిస్తారా?’ ఇది పిరికిపందల చర్య: ఓవైసీ నిందితుడి జేబులో లెటర్ : పథకం ప్రకారమే దాడి -
విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తోన్న ఖాజాపాషా(51) అనే వ్యక్తి నుంచి సీఐఎస్ఎఫ్ అధికారులు ఆది వారం ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన హెడ్ కాని స్టేబుల్ ఖాజాపాషా బదిలీపై వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అతడి బ్యాగులో అధికారులు తనిఖీలు చేపట్ట గా.. 9 ఎంఎంకు చెందిన రెండు బుల్లెట్లు, 0.32 ఎంఎంకు చెందిన 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. సంబంధిత పత్రాలు లేక పోవడంతో ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. కరీంనగర్లో విధులు నిర్వహించనప్పటి బుల్లెట్లు డిపా జిట్ చేయకుండా దగ్గరే ఉంచుకున్నా నని.. వాటిని బ్యాగులో మరిచిపోయి నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం. -
ఎయిర్పోర్ట్ గస్తీ అధికారి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాజ్ సింగ్ (58) అనే సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మంగళవారం రాత్రి విధులకు హాజరుకావాల్సి ఉంది. కానీ అనుహ్యంగా బిజ్వాసన్ లోని సీఐఎస్ఎఫ్ క్యాంపులో తన సర్వీసు తుపాకీతో తనను కాల్చుకున్నాడు. ఫలితంగా మూడు బుల్లెట్లు తగిలాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. రాజ్ సింగ్ 1980 నుంచి సీఐఎస్ఎఫ్లో చేరి విధులు నిర్వర్తించాడు.