సమస్యల లంగరు | Anchorage issues | Sakshi
Sakshi News home page

సమస్యల లంగరు

Sep 22 2014 1:31 AM | Updated on Sep 2 2017 1:44 PM

సమస్యల లంగరు

సమస్యల లంగరు

నిజాంపట్నం కోస్తా తీరంలో ఎంతో ప్రాధాన్యమున్న నిజాంపట్నం హార్బర్‌లో సమస్యలు లంగరేశారుు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి జాడ కనిపించటం లేదు.

నిజాంపట్నం
 కోస్తా తీరంలో ఎంతో ప్రాధాన్యమున్న నిజాంపట్నం హార్బర్‌లో సమస్యలు లంగరేశారుు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి జాడ కనిపించటం లేదు. అటవీ శాఖకు చెందిన 38 ఎకరాల స్థలంలో 1980లో హార్బర్‌ను ఏర్పాటు చేశారు. హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లేందుకు అనుసంధానంగా ఉన్న మొగ వద్ద ఎప్పటికప్పుడు ఇసుక మేట వేస్తుండటంతో బోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్నిసార్లు నేల తగిలి బోట్లు ధ్వంసమవుతున్నారుు. కొన్ని ఘటనల్లో జాలర్లు గల్లంతయ్యూరు కూడా. అరుునా అధికారులు పట్టించుకోవటం లేదు.
 జిల్లాలోని లంకేవానిదిబ్బ నుంచి బాపట్ల వరకు సుమారు 22 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. జిల్లాలో దాదాపు 6,812 మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారుు. నిజాంపట్నం హార్బర్ నుంచి రోజుకు సుమారు 20 టన్నుల చేపలు ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతున్నారుు.
 జెట్టీ చాలక ఇబ్బందులు
 హార్బర్‌లో ప్రస్తుతం ఉన్న జెట్టీ 50 బోట్లను నిలుపుకునేందుకు సరిపోతోంది. ప్రస్తుతం ఇక్కడ లెసైన్స్ ఉన్న బోట్లు సుమారు 150 ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా కాకినాడ, విశాఖపట్నం, చీరాల, నెల్లూరు, చెన్నై, కోల్‌కతాలకు చెందిన బోట్లు కూడా ఇక్కడికి వస్తుంటాయి. విపత్తుల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బోట్లను ఇక్కడే నిలుపుదల చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో జెట్టీలో చోటు కోసం బోట్ల యజమానులు బాహాబాహీకి దిగుతున్నారు. జెట్టీకి దూరంగా లంగరేసిన బోట్లు ఈదురు గాలుల ధాటికి సముద్రంలోని కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నారుు.
 
 వైఎస్ మరణంతో ఆగిన ఫైలు
 గతంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జెట్టీ సమస్యను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన వై.ఎస్. జెట్టీ విస్తరణ చేపట్టేందుకు అనుమతులిచ్చారు. జెట్టీ నిర్మాణానికి 5 ఎకరాల అటవీ భూమిని కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. వై.ఎస్. మరణానంతరం ఫైలు కదలిక దాదాపు నిలిచిపోరుుంది. ఫలితంగా జెట్టీ విస్తరణ పనులు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement