సిక్కోలు పర్యటనకు అమిత్‌ షా | Amit Shah Tour To Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సిక్కోలు పర్యటనకు అమిత్‌ షా

Feb 3 2019 5:43 PM | Updated on Feb 3 2019 5:46 PM

Amit Shah Tour To Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా  సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్డుకు చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి విజయనగరంలో జరిగే శక్తి కేంద్ర ప్రముక్‌ కార్యక్రమంలో షా పాల్గొననున్నారు. మధ్యాహ్నాం రెండు గంటలకు శ్రీకాకుళం జిల్లా పలాస చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.  

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో  ఏపీ బీజేపీ నేతలు నిర్వహించనున్న బస్సు యాత్రను అమిత్‌షా ప్రారంభించనున్నారు. షా పర్యటన నేపథ్యంలో ఏపీ బీజేపీ శాఖ ఏర్పాట్లును ముమ్మరం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement