
సోషల్‌మీడియాకు సంకెళ్లా?
షల్‌మీడియాకు సంకెళ్లు వేయాలనుకుంటే అది అధికార పార్టీ పిచ్చితనం అవుతుందని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు.
అమరావతి: సోషల్‌మీడియాకు సంకెళ్లు వేయాలనుకుంటే అది అధికార పార్టీ పిచ్చితనం అవుతుందని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు. మీడియాను లోబర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్‌మీడియాను తన అదుపులోకి తెచ్చుకోవాలని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.
యూట్యూబ్‌లో పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్టు దుర్మార్గమని అన్నారు. సోషల్‌మీడియా బాబు, లోకేష్‌లు భయపడుతున్నారనడానికి రవికిరణ్ అరెస్టే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలను వెలుగులోకి తెస్తే అరెస్టు చేస్తార? అని ప్రశ్నించారు. రవికిరణ్‌కు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని చెప్పారు.