కార్లన్నీ ఊళ్లకే.... హైదరాబాద్ నుంచి వెళ్లిన వాహనాలు | All Vehicles go to villages for sankranthi festival | Sakshi
Sakshi News home page

కార్లన్నీ ఊళ్లకే.... హైదరాబాద్ నుంచి వెళ్లిన వాహనాలు

Jan 12 2014 4:06 AM | Updated on Sep 2 2017 2:31 AM

రెండో శనివారం, ఆదివారం సెలవులతో సంక్రాంతి సెలవులు మొదలైయ్యాయి. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినా ఏమాత్రం చాలక నగరవాసులు కార్లలో ప్రయాణం సాగిస్తున్నారు.

రెండో శనివారం, ఆదివారం సెలవులతో సంక్రాంతి  సెలవులు మొదలైయ్యాయి. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినా ఏమాత్రం చాలక నగరవాసులు కార్లలో ప్రయాణం సాగిస్తున్నారు. జాతీయ రహదారులు వాహనాలతో కిటకిటలాడాయి. శుక్ర, శనివారాల్లో  హైదరాబాద్ నుంచి  రహదారుల మీదుగా వెళ్లిన వాహనాల ను సాక్షి పరిశీలించింది.
 ఆ వివరాలు..
 
 హోటళ్లకు... ముందే పండగ హైదరాబాద్ - విజయవాడ హైవే పక్కన హోటళ్లు, దాబా హోటళ్లకూ గిరాకీ పెరిగింది. సూర్యాపేట సమీపంలోని  7 స్టార్ హోటల్‌లో వారం రోజుల నుంచి  రోజుకి రూ. లక్ష పైనే వ్యాపారం నడిచినట్లు సమాచారం. ఒక్క శనివారం నాడే రూ.4 లక్షల మేర బిజినెస్ నడిచినట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది. జీ హోటల్‌లో కూడా గత వారం రోజుల నుంచి వ్యాపారం బాగా నడుస్తోందని హోటల్ యజమానులు తెలిపారు. మొత్తానికి హైవే పక్క హోటళ్లకు ముందే పండగ వచ్చిన ట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement