నాన్నగారు క్షేమంగానే ఉన్నారు: నాగార్జున | akkineni nageswara rao is safe.. clarifies nagarjuna | Sakshi
Sakshi News home page

నాన్నగారు క్షేమంగానే ఉన్నారు: నాగార్జున

Jan 8 2014 12:14 PM | Updated on Jul 15 2019 9:21 PM

నాన్నగారు క్షేమంగానే ఉన్నారు: నాగార్జున - Sakshi

నాన్నగారు క్షేమంగానే ఉన్నారు: నాగార్జున

అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్యంపై వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన కుమారుడు, సినీనటుడు నాగార్జున అన్నారు.

హైదరాబాద్ : అక్కినేని ఆరోగ్యంపై వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన కుమారుడు, సినీనటుడు నాగార్జున అన్నారు. నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. అక్కినేని ఆరోగ్యం కుదుటపడిందని...ఆయన ఉత్సాహంగానే ఉన్నారని నాగార్జున తెలిపారు.

అక్కినేని అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను నాగార్జున ఖండించారు. కాగా గత కొంతకాలంగా అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే.  ఇందుకు సంబంధించి శస్త్ర చికిత్స కూడా జరిగింది. తనకు క్యాన్సర్ ఉన్నట్లు అక్కినేని స్వయంగా మీడియాకు తెలియ చేశారు కూడా.

ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కినేని గత రెండు రోజులుగా బాగా నీరసంగా ఉండటంతో ఆయనకు ఇంటి దగ్గరే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ వార్తలను నాగార్జున తోసిపుచ్చారు. పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అక్కినేనికి అనారోగ్యం అంటూ వచ్చిన వార్తలను నాగార్జున ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement