తిరుమలకు చేరిన ఆకేపాటి పాదయాత్ర

Akepati Amarnath Reddy Reached Tirumala Pddayatra - Sakshi

జగన్‌ సీఎం కావాలని, అన్నమయ్య మార్గం

పునరుద్ధరించాలని ఆకాంక్ష

చిత్తూరు  ,తిరుమల : తమ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని, వైఎస్సార్‌ జిల్లా రాజంపేట నుంచి తిరుమలకు ఉన్న పురాతన అన్నమయ్య మార్గం పునరుద్ధరణకు నోచుకోవాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి చేపట్టిన మహాపాదయాత్ర సోమవారం తిరుమలకు చేరుకుంది. సుమారు 3 వేల మంది భక్తులతో రాజంపేట మండలం ఆకేపాడు ఆలయాల సముదా యం నుంచి 17వ తేదీ పాదయాత్ర ప్రారంభించారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల అన్నమ య్య మార్గాన్ని పునరుద్ధరించేందుకు దివంగత సీఎం వైఎస్‌. రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. రాజంపేటలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహాన్ని రాజశేఖరరెడ్డి హయాం లో ఏర్పాటు చేశారన్నారు. అన్నమయ్యను గుర్తుంచుకోవాలం టే ఈ దారిని పునరుద్ధరించాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా పథకా లు ప్రజలకు అందుతాయన్నారు.

రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మా ట్లాడుతూ ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ స్వామి దయతో కాలిబాటలో తిరుమలకు వచ్చి దర్శించుకోవడం చాలా సం తో షంగా ఉందన్నారు.జగన్‌ సీఎం అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ అమరనాథరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాలుç ³ంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు కష్టాల నుంచి విముక్తి కల్పించడానికి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం రావాలని ఆశిస్తున్నామన్నారు. ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. అంతకుముందు కుక్కలదొడ్డి నుంచి కాలిబాటలో తిరుమలకు చేరుకున్న అమరనాథరెడ్డికి ఘనస్వాగతం లభించింది. పార్టీ తిరుమల నాయకులు పెంచలయ్యతో పాటు పలువురు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వీరికి టీటీడీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. సోమవారం రాత్రి శ్రీవారిని దర్శించుకుని తిరిగి మంగళవారం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top