గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి స్థల పరిశీలన | airport athoritys visits bhogapuram | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి స్థల పరిశీలన

Mar 16 2015 2:14 PM | Updated on Sep 2 2017 10:56 PM

గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి స్థల పరిశీలన

గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి స్థల పరిశీలన

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు అధికారులు సోమవారం స్థల పరిశీలన చేశారు.

భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు అధికారులు సోమవారం స్థల పరిశీలన చేశారు. మండలంలోని దిబ్బలపాలెం గ్రామంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ప్రాంతీయ డెరైక్టర్ శ్రీవాస్తవ, విశాఖపట్నం విమానాశ్రయం డెరైక్టర్ పట్టాభి, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు, ఆర్డీవో వెంకట్రావ్, తహసీల్దారు లక్ష్మారెడ్డి తదితరులు పరిశీలించారు.

సముద్ర తీరానికి ఎంత దూరంలో ప్రతిపాదిత భూములు ఉన్నాయి, విమానాశ్రయానికి అనుకూలమా..కాదా  తదితర అంశాలకు సంబంధించి భౌగోళిక అధ్యయనం జరిపారు. తమ భూములు పోతాయేమోనన్న ఆందోళన రైతుల్లో ఉందని, ఎన్ని ఎకరాలు సేకరించనున్నారని విలేకరులు అడగ్గా... తాము కేవలం స్థలం అనుకూలమా? కాదా? అన్న అంశానికే పరిమితమైనట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement