రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సర్వం సిద్ధం | Advanced Mathematics to prepare for the test tomorrow | Sakshi
Sakshi News home page

రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సర్వం సిద్ధం

May 24 2014 12:26 AM | Updated on Sep 2 2017 7:45 AM

అ జేఈఈ డ్వాన్స్‌డ్ పరీక్షను ఈ నెల 25న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది.

హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఈ నెల 25న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. పరీక్షకు జేఈఈ-మెయిన్‌లో తొలి 1,54,000లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 21,818 మంది అర్హత సాధించారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 1న వెబ్‌సైట్‌లో ‘కీ’ను పెడుతారు, 19న ఫలితాలు విడుదల చేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement