సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు | Additional RTC buses for Sankranti festival | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు

Jan 7 2015 6:10 AM | Updated on Sep 2 2017 7:21 PM

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు ప్రతీరోజు ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే 3,560 రెగ్యులర్ బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నెల 8 నుంచి 13 వరకు అదనపు బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు ప్రతీరోజు ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే 3,560 రెగ్యులర్ బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నెల 8 నుంచి 13 వరకు అదనపు బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రయాణికులు ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేయించుకోవడంతో ఈ నెల 9 నుంచి 13 వరకు రెగ్యులర్ బస్సుల్లో సీట్లు సుమారు 90 శాతం భర్తీ అయ్యాయి. తెలంగాణ ప్రాంతాలకు కేవలం 20 శాతం రిజర్వ్ కాగా.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు రెగ్యులర్ బస్సుల సీట్లన్నీ ఫుల్ అయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement