అస్సలు భయపడలేదు: తరుణ్‌

Actor Tarun attend Amaravathi film festival - Sakshi

కెమెరాకు ఎప్పుడూ భయపడలేదు. సినీఫీల్డ్‌లో అవకాశాలు రావడం నా అదృష్టం. వచ్చిన వాటిని నిలబెట్టుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. చిరంజీవి, రజనీకాంత్‌ మాదిరిగా సినిమాలు చేయలేను. ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి. అప్పుడే విజయం సాధిస్తారని సినీనటుడు తరుణ్‌ అన్నారు. అమరావతి ఫిలిమ్‌ ఫెస్టివల్‌ –2017 రెండోరోజు సినీనటుడు తరుణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి తాను నటించిన అంజలి సినిమా చూశారు. హాయ్‌.. చెబుతూ విద్యార్థుల మధ్యకు వెళ్లి అల్లరి చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

విద్యార్థి : అంజలి సినిమా చేసినప్పుడు మీ వయసు ఎంత? చాన్స్‌ ఎలా వచ్చింది?
తరుణ్‌ : అప్పుడు నా వయసు ఏడేళ్లు. కో–డైరెక్టర్‌ పాణి తాత అంజలిలో నటిస్తావా అని అడిగారు. మణిరత్నం నా అభిమాన డైరెక్టర్‌. ఆయన్ను కలిస్తే చాలు అనుకునేవాడ్ని. ఆయన మూవీలో చాన్స్‌ అనే సరికి ఎగిరి గంతేశా.
విద్యార్థి :  ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎలా ఫీలయ్యారు?
తరుణ్‌ : సమ్మర్‌ హాలిడేస్‌లో రెండు నెలలు షూటింగ్‌ చేశారు. పిల్లలందరినీ ఒకచోట ఆడుకోమనే వారు. షాట్‌ అనగానే పరుగెత్తుకెళ్లే వాళ్లం. షూటింగ్‌ను చాలా ఎంజాయ్‌ చేశా.
విద్యార్థి :  కెమెరాను చూసి ఎప్పుడైనా భయపడ్డారా?
తరుణ్‌ : అస్సలు భయపడలేదు. ఫస్ట్‌ షాట్‌ అంటే కొంచెం టెన్షన్‌ ఉంటుంది.  ఆ తరువాత మామూలే.
విద్యార్థి : మీ ఫెవరేట్‌ మూవీ? ఈ జనరేషన్‌లో ఏ హీరో అంటే ఇష్టం?
తరుణ్‌ : ‘నువ్వేనువ్వే’ అంటే నాకు చాలా ఇష్టం. రామ్‌చరణ్, పవన్‌ కళ్యాణ్‌ నా ఫేవరేట్‌ స్టార్స్‌
విద్యార్థి :  చైల్డ్‌ ఆర్టిస్ట్, హీరో ఈ రెండింటిలో ఏది బాగుంది?
తరుణ్‌ : చైల్డ్‌ ఆర్టిస్టుగా అంటే స్కూల్‌ మానేసి షూటింగ్‌కు వెళ్లడం సరదాగా ఉండేది. హీరో అంటే బాధ్యతగా పనిచేయాలి. రెండూ బాగున్నాయి.
విద్యార్థి :  చాలా గ్యాప్‌ తీసుకున్నారు? మీ కొత్త సినిమా విశేషాలు చెప్పండి?
తరుణ్‌ : నా సినిమా వచ్చి ఏడాది అయింది. మంచి స్క్రిప్ట్‌ కోసం వెయిట్‌ చేశా.   ‘ఇది నా లవ్‌’ మూవీ పూర్తయింది. డిసెంబర్‌ మొదటివారంలో రిలీజ్‌ చేస్తున్నాం.
విద్యార్థి : మీరు ఎలాంటి సినిమాల్లో నటించేందుకు ఇష్టపడతారు?
తరుణ్‌ : నాకు సరిపోయే కథలనే ఎంచుకుంటా. రజనీకాంత్, చిరంజీవి లాంటి సినిమాలు నేను చేయలేను.
విద్యార్థి :  మీకు క్రికెట్‌ అంటే ఇష్టం కదా? యాక్టింగ్‌ను ఎందుకు ఎంచుకున్నారు?
తరుణ్‌ : నాకు క్రికెట్‌ అంటే ఇష్టమే. సినీ అవకాశాలు అతికొద్దిమందికి మాత్రమే వస్తాయి. అందుకే యాక్టింగ్‌ను ఎంచుకున్నా.  
విద్యార్థి :  మీ రోల్‌ మోడల్‌ ఎవరు?
తరుణ్‌ : సచిన్‌ టెండూల్కర్‌
విద్యార్థి :  సినీనటుడిగా మీ అమ్మగారి ప్రభావం మీపై ఎంతవరకు ఉంది?
తరుణ్‌ : అమ్మ, నేను ఇద్దరం చైల్డ్‌ ఆర్టిస్టుల నుంచే ఇండస్ట్రీకి వచ్చాం. సినిమాల విషయంలో ఎప్పుడూ అమ్మ  జోక్యం చేసుకోలేదు. మంచి సినిమాలు
చేయమని చెబుతుంది అంతే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top