
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలో ట్రాన్స్‌కో అవినీతి చేప చిక్కింది. విద్యుత్ మీటర్ కోసం లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్‌కో అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాలు.. రాయచోటి పట్టణంలో విద్యుత్ మీటర్ కోసం ఓ వినియోగదారుడు నిత్యం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ రూ.15 వేలు ముట్టజెపితేనే పని అవుతుందని రాయచోటి వెస్ట్ జోన్ ఏఈఈ ఆర్.జయప్రకాశ్ నాయక్ పేర్కొన్నారు. లేకపోతే పని జరగదని హెచ్చరించారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు జయప్రకాశ్ బాధితుడి దగ్గర డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో డీఎస్పీ జనార్దన్ నాయుడు, సీఐ శ్రీనివాసులు రెడ్డి, రెడ్డప్ప, ఎస్‌ఐ నౌషాద్ భాషా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.