ఏసీబీకి పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్ | acb arrested a junior asseistence in vijayawada | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్

Feb 26 2015 4:18 PM | Updated on Sep 2 2017 9:58 PM

ఏసీబీకి పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్

ఏసీబీకి పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్

ఓ స్వచ్చంధ సంస్థ నుంచి లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు.

కష్ణా : ఓ స్వచ్చంధ సంస్థ నుంచి లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు. వివరాలు కృష్ణాజిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎ.వాసుదేవరావు అనే వ్యక్తి జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. నిత్య జీవం మినిస్ట్రైవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రిజిస్ర్టేషన్ రెన్యూవల్ చేయించడానికి విజయవాడ పటమటలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. రిజిస్ర్టేషన్ రెన్యూవల్ చేయాలంటే రూ. 21వేలు లంచం ఇవ్వాలని వాసుదేవరావు అడిగాడు. అయితే సంస్థ ప్రతినిధి రూ. 16 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అనంతరం ఈ విషయం గురించి బాధితులు ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకష్ణ ఆధ్వర్యంలో వాసుదేవరావును ట్రాప్ చేసి లంచం తీసుకుంటుండగా గురువారం పట్టుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి రూ.16 వేలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(విజయవాడ)
 

Advertisement
 
Advertisement
Advertisement