చేతబడి అనుమానంతో ఒక మహిళను గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు.
చేతబడి అనుమానంతో ఒక మహిళను గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. ఈ ఘనట విశాఖపట్టణం జిల్లా డుమ్రిగూడ మండలం రాంసింగ్ గూడలో జరిగింది. మానవుడు అభివృద్ధి వైపు దూసుకుపోతున్నా.. మూడనమ్మకాలు ప్రజలను మూర్ఖులుగా మారుస్తుందని ఈ ఘటన నిరూపించింది.
వివరాల్లోకి వెళితే.. గూడేనికి చెందిన రాజమ్మ (45) అనే మహిళ చేతబడి చేస్తోందన్న అనుమానంతో ఆమెను శనివారం సాయంత్రం ఇంట్లో సజీవ దహనం చేశారు. ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పు పెట్టడంతో ఆమె మంటల్లో పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.