పెళ్ళి పనులు కోసం వెళుతున్న తాతా మనవళ్లను టెంపో ఢీకొట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఉలవ పాడు మండలం వీరేపల్లి వద్ద జరిగింది.
పెళ్ళి పనులు కోసం వెళుతున్న తాతా మనవళ్లను టెంపో ఢీకొట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఉలవ పాడు మండలం వీరేపల్లి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉలవపాడుకు చెందిన తన్నీరు వెంకటేశ్వరరావుతన మనవడు అనిల్ పెళ్లి పనుల కోసం బయలు దేరారు. వీరు వెళుతున్న బైక్ ను వీరేపల్ఇ వద్ద టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది.