నిండు గర్భిణి ఆత్మహత్య | 9months pregnant woman commits suicide | Sakshi
Sakshi News home page

నిండు గర్భిణి ఆత్మహత్య

Feb 21 2016 12:19 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఓ నిండు గర్భిణి.. స్థల విషయంలో జరిగిన వివాదంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.

చిన్నగంజాం (ప్రకాశం) : ఓ నిండు గర్భిణి.. స్థల విషయంలో జరిగిన వివాదంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామంలో ఈ ఘటన జరిగింది. మరతాల శ్రీలక్ష్మి (25)కి శనివారం మధ్యాహ్నం ఓ స్థలం విషయంలో బంధువులతో గొడవ జరిగింది.

మనస్తాపం చెందిన ఆమె సాయంత్రం పురుగుల ముందు సేవించింది. అయితే మందు తాగినట్టు ఎవరికీ చెప్పకపోవడంతో రాత్రి 11 గంటల తర్వాత ఆమె ఇంటి వద్దే ప్రాణాలు కోల్పోయింది. శ్రీలక్ష్మికి భర్త రామాంజనేయులు, రెండేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం 9 నెలల గర్భిణి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement