కుట్రలు ఛేదించడానికి ప్రజలే సైనికులవుతారు: విజయమ్మ | 67th indian independence day celebration at ysr congress party office | Sakshi
Sakshi News home page

కుట్రలు ఛేదించడానికి ప్రజలే సైనికులవుతారు: విజయమ్మ

Aug 15 2013 10:50 AM | Updated on Jan 7 2019 8:29 PM

వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగిస్తున్న వైఎస్ విజయమ్మ. - Sakshi

వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగిస్తున్న వైఎస్ విజయమ్మ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన జరిగితే అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ కుట్రలు ఛేదించడానికి ప్రజలే ఒక సైన్యంగా,  ఉప్పెనలా వచ్చే రోజు త్వరలోనే ఉందని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హెచ్చరించారు.  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయమ్మ గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

క్రాంగెస్ పార్టీలో అగ్రనేతలకే స్వాతంత్ర్యం వచ్చింది కానీ ...ప్రజలకు కాదని ఆమె స్ఫష్టం చేశారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజించు- పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రజలకు ఓటేయాలి విజయమ్మ ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఎదిరిస్తే జైలులో పెడుతున్నారు తెలిపారు.

ఓట్లు- సీట్లే పరమావధిగా తీసుకున్న ఏ నిర్ణయాన్ని ఏ ఒక్కరూ హర్షించరని ఈ సందర్భంగా విజయమ్మ తెలిపారు. చంద్రబాబుది పూటకో మాట, రోజుకో తీరులా వ్యవహారిస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. చంద్రబాబు సహకారం వల్లే విభజన జరిగిందన్న సంగతి బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. విభజనను సమర్థిస్తూ చంద్రబాబు కాకి లెక్కలు చెప్పారన్న సంగతిని విజయమ్మ ఈసందర్భంగా గుర్తు చేశారు.వైఎస్‌ను ప్రేమించే హృదయానికి, జగన్, షర్మిలను అక్కున చేర్చుకున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు విజయమ్మ తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమంలను  రెండు కళ్లుగా భావించారన్నారు. అన్ని ప్రాంతాలకు మేలు చేసే విధంగా ఆ మహానేత సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన జరిగితే అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం జరగాలని తమపార్టీ మొదటినుంచి అడుగుతోందని వైఎస్ విజయమ్మ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ముఖ్యనేతలతోపాటు పలువురు కార్యకర్తలు అధిక సంఖ్య జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement