నెల్లూరు జిల్లా వెలిగొండ, మర్రిపాడు అటవీ ప్రాంతంలో పోలీసులు ఆదివారం కూంబింగ్ నిర్వహించారు.
నెల్లూరు : నెల్లూరు జిల్లా వెలిగొండ, మర్రిపాడు అటవీ ప్రాంతంలో పోలీసులు ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 61 మంది ఎర్రచందనం కూలలీలను అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురు ప్రధాన ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే పట్టుబడిన కూలీలు శేషాచలం అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో పరారైన వారిగా గుర్తించారు. సదరు కూలీలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారు సమాచారం మేరకు రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.