లైంగికదాడికి పాల్పడిని నిందితులకు రిమాండ్ | 5 people gangrape minor girl, arrested in vizianagaram district | Sakshi
Sakshi News home page

లైంగికదాడికి పాల్పడిని నిందితులకు రిమాండ్

Sep 30 2014 8:50 AM | Updated on Aug 20 2018 4:27 PM

లైంగికదాడికి పాల్పడిని నిందితులకు రిమాండ్ - Sakshi

లైంగికదాడికి పాల్పడిని నిందితులకు రిమాండ్

నానం చేస్తున్న బాలిక వీడియో తీసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన గ్యాంగ్‌ను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయనగరం :  స్నానం చేస్తున్న బాలిక వీడియో తీసి సామూహిక అత్యాచారానికి  పాల్పడిన గ్యాంగ్‌ను  విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.   గజపతి మండలం పురిటిపెంటకు చెందిన బాలిక స్నానం చేస్తుండగా అదే  గ్రామానికి చెందిన శివాజీ నాయక్‌ అనే  యువకుడు వీడియో తీశాడు. దీన్ని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి బాలికపై పలు సార్లు అత్యాచారం చేశాడు.

బెదిరింపులు పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక  ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. బాలిక ఇచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు శివాజి నాయక్‌తో పాటు నలుగురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.  నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారందరిని సోమవారం రాత్రి రిమాండ్కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement