కరెంట్ వైర్ తగిలి బాలుడు మృతి | 4 years old boy dies of electrocution | Sakshi
Sakshi News home page

కరెంట్ వైర్ తగిలి బాలుడు మృతి

Feb 6 2016 6:42 PM | Updated on Sep 3 2017 5:04 PM

వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని అంధుల కాలనీలో విద్యుత్ వైరు తగిలి నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు.

కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని అంధుల కాలనీలో విద్యుత్ వైరు తగిలి నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. అంధుల కాలనీకి చెందిన పెద్ద నర్సింహ కుమారుడు నర్సింగ్(4) శనివారం మధ్యాహ్నం వీధిలో ఆడుకుంటుండగా తెగి పడి ఉన్న విద్యుత్ వైరును పట్టుకున్నాడు. కరెంట్ షాక్ కొట్టి బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సింహకు ఇద్దరు కుమారులు కాగా నర్సింగ్ రెండవ కుమారుడు.

Advertisement
 
Advertisement
Advertisement