వేములపల్లిలో మూడేళ్ల బాలిక హత్య | 3 years old girl brutally murdered in Vemulapalli | Sakshi
Sakshi News home page

వేములపల్లిలో మూడేళ్ల బాలిక హత్య

Jun 29 2015 2:55 PM | Updated on Sep 3 2017 4:35 AM

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది.

కృష్ణా (కంచికచర్ల) : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల్లి నాగేశ్వరరావు మూడవ కుమార్తె కోటేశ్వరి(3)ని.. గ్రామ పరిసర పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు.

సంఘటనాస్థలంలో మద్యం సీసాలు కనుగొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement