వరద నీటిలో కొట్టుకుపోయిన బాలుడు | 3 year old boy washed away in flood water | Sakshi
Sakshi News home page

వరద నీటిలో కొట్టుకుపోయిన బాలుడు

Sep 12 2015 5:46 PM | Updated on Aug 1 2018 3:59 PM

వాన నీటిలో ఆడుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు వరద ఉధృతికి కొట్టుకుపోయాడు.

చీపురుపల్లి (విజయనగరం) : వాన నీటిలో ఆడుకునేందుకు వెళ్లిన ఓ బాలుడు వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పాతగవిడి వీధికి చెందిన మీసాల పెంటయ్య, కవిటమ్మ దంపతుల చిన్న కుమారుడు జయప్రకాశ్(3) వాన వెలసిన తర్వాత నీళ్లలో ఆడుకునేందుకు వీధిలోని మురుగు కాలువ వద్దకు వెళ్లాడు. అంతలోనే వరద ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రమాదవశాత్తు జయప్రకాశ్ అందులో పడి కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు బాలుడి కోసం నీళ్లలో గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement