కుటుంబ కలహాలు: ముగ్గురి ఆత్మహత్యాయత్నం | 3 members suicide attempt nellore district | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలు: ముగ్గురి ఆత్మహత్యాయత్నం

Jan 29 2016 11:38 AM | Updated on Oct 20 2018 6:19 PM

కుటుంబకలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు.

బుచ్చిరెడ్డిపాళెం: కుటుంబకలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళెం శివారు వడ్డిపాళెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త ప్రభావతి, ఆమె భర్త కుమార్, కుమార్తె సింధు(7) గురువారం రాత్రి గుళికల మందు తిని ఆత్మహత్యకు యత్నించారు. వేకువజామున గమనించిన కుటుంబసభ్యులు వారిని బుచ్చిరెడ్డిపాళెం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement