హైవేపై కారు బీభత్సం | 3 injured in road accident | Sakshi
Sakshi News home page

హైవేపై కారు బీభత్సం

Oct 17 2015 7:41 PM | Updated on Sep 3 2017 11:06 AM

రోడ్డు దాటుతున్న మహిళను తప్పించడానికి ప్రయత్నించిన కారు అదుపుతప్పి మందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.

చెన్నెకొత్తపల్లి (అనంతపురం) :  రోడ్డు దాటుతున్న మహిళను తప్పించడానికి ప్రయత్నించిన కారు అదుపుతప్పి మందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న మహిళతోపాటు కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం ఎర్రంపల్లి సమీపంలోని 44 జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది.

చెన్నెకొత్తపల్లి నుంచి అనంతపురం వెళ్తున్న సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కారు ఎర్రంపల్లి సమీపంలోకి రాగానే గ్రామానికి చెందిన మహిళ రోడ్డు దాటుతుంది. ఆమెను తప్పించడానికి ప్రయత్నించడంతో.. కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరితోపాటు రోడ్డు దాటుతున్న మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement