చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు | 3 injured in bus accident at east godavari | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు

Aug 4 2015 10:56 AM | Updated on Sep 3 2017 6:46 AM

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది

పెద్దాపురం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని పుట్టగొడుగుల ప్యాక్టరీ వద్ద మంగళవారం జరగింది. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున ట్రావెల్స్ బస్సు ఫ్యాక్టరీ వద్దకు రాగానే ఎదురుగా మరో వాహనం వస్తుండటంతో దాన్ని తప్పించడానికి ప్రయత్నించి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.

రాత్రి నుంచి వర్షం పడుతుండటం, రోడ్డు చిత్తడిగా ఉండటంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెండు చెట్లను ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జుకాగా.. బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement