కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు పసికందులు మృతి చెందారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు పసికందులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి నగరంలో భారీగా వర్షం కురిసింది. దాంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయానికి ఆసుపత్రిలోని జనరేటర్లో కూడా సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఆసుపత్రిలో ముగ్గురు పసికందులు మృత్యువాత పడ్డారు. దాంతో ఆసుపత్రి ఎదుట పసికందుల బంధువులు ఆందోళనకు దిగారు.