24 నుంచి కాకతీయ ఉత్సవాలు | 24 events from the Kakatiya | Sakshi
Sakshi News home page

24 నుంచి కాకతీయ ఉత్సవాలు

Sep 12 2013 1:37 AM | Updated on Mar 21 2019 7:25 PM

కాకతీయ ఉత్సవాలు తిరిగి ఈ నెల 24నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కిషన్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయులపై సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కాకతీయ ఉత్సవాలు తిరిగి ఈ నెల 24నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కిషన్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయులపై సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం వరంగల్ మునిసిపల్ కమిషనర్ వివేక్‌యాదవ్, అదనపు జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్, జిల్లా టూరిజం అధికారి శివాజీ, జిల్లా పౌరసంబంధాల అధికారి కె.వెంకటరమణ, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావుతో కలెక్టర్ సమావేశమయ్యారు.

24, 25, 26 తేదీల్లో ఘణపురం ఉత్సవాలను ములుగుఘణపురం కోటగూళ్ల దగ్గర నిర్వహించనున్నట్లు తెలిపారు. రాణిరుద్రమ దేవి సామ్రాజ్య అధినేతగా బాధ్యతలు చేపట్టి 750 సంవత్సరాలు పూర్తయినందున అక్టోబర్ 2న ఖిలా వరంగల్‌లో మహిళా సాధికారత అనే అంశంపై ఇంటాక్ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 5,6 తేదీలలో కాకతీయ యువ జనోత్సవాలను నిర్వహిస్తామని, ఈ యువజనోత్సవాల్లో భాగగా అన్ని కళాశాలల విద్యార్థులు భాగస్వామ్యం చేస్తామన్నారు.
 
కాకతీయుల చరిత్ర, నీటి పారుదల వ్యవస్థ, నిర్మాణ శైలి ఇతర అంశాలపై కాకతీయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐటి, ఇంటాక్‌లతో సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. నవంబర్ 14న బాలల దినోత్సవాల సందర్బంగా కాకతీయ బాలల ఉత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement