ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లా ఓపెన్ ఎయిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలకు ఒకేరోజు పెరోల్ మంజూరు చేసింది.
‘శ్వేతపత్రాలు’గా ఉన్న ఆన్‌లైన్ జీవోలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లా ఓపెన్ ఎయిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలకు ఒకేరోజు పెరోల్ మంజూరు చేసింది. ఒకేరోజు 21 మంది ఖైదీలకు ఒక్కొక్కరికి 30 రోజుల చొప్పున పెరోల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హోం శాఖ గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు రాజమండ్రి, కడప సెంట్రల్ జైళ్ళల్లో ఉన్న మరో నలుగురికీ పెరోల్ ఇచ్చింది. మొత్తంగా ఒకేరోజు 25 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు చేయడం ఇదే తొలిసారి. న్యాయస్థానంలో నేరం నిరూపితమై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు నిర్ణీత కాలం శిక్ష పూర్తి చేసిన తరవాత కొన్ని రోజుల పాటు జైలు నుంచి బయటకు విడిచిపెట్టడాన్నే పెరోల్ అంటారు. ఇతర ఉత్తర్వుల మారిదిగానే పెరోల్ జీవోలను హోం శాఖ ఆన్‌లైన్‌లో ఉంచినప్పటికీ ఖైదీతో పాటు కేసులకు సంబంధించిన పూర్వాపరాలను మాత్రం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేదు.