విశాఖ జిల్లా మాడుగుల మండలం సాగరం వద్ద సోమవారం భారీగా గంజాయి పట్టుబడింది
200 కిలోల గంజాయి స్వాధీనం
Jun 12 2017 1:39 PM | Updated on Sep 19 2019 2:50 PM
విశాఖపట్నం: విశాఖ జిల్లా మాడుగుల మండలం సాగరం వద్ద సోమవారం భారీగా గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. పోలీసులను గుర్తించిన స్మగ్లర్లు కారును వేగంగా పక్కకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ముగ్గురు స్మగ్లర్లు అక్కడి నుంచి పరారు కాగా పోలీసులు కారుతో పాటు 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Advertisement


