20 కిలోల గంజాయి పట్టివేత | 20 kilograms of Cannabis seized | Sakshi
Sakshi News home page

20 కిలోల గంజాయి పట్టివేత

Oct 29 2015 5:37 PM | Updated on Sep 3 2017 11:41 AM

ఒడిశా నుంచి జార్ఖండ్‌కు కారులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని అనంతగిరి పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

అనంతగిరి (విశాఖపట్నం) : ఒడిశా నుంచి జార్ఖండ్‌కు కారులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని అనంతగిరి పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డమకు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement