అన్నివర్గాల మద్దతుతో జగన్‌ను సీఎం చేద్దాం | 20 Families From TDP To YSRCP | Sakshi
Sakshi News home page

అన్నివర్గాల మద్దతుతో జగన్‌ను సీఎం చేద్దాం

Jun 4 2018 12:40 PM | Updated on Sep 2 2018 4:52 PM

20 Families From TDP To YSRCP - Sakshi

పార్టీలో చేరిన వారికి కండువాలు వేస్తున్న ధర్మాన కృష్ణదాస్‌ 

జలుమూరు శ్రీకాకుళం : వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని ఆ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. అందవరం పంచాయతీ రామకృష్ణాపురం ఎస్సీ కాలనీకి చెందిన గౌడ రాజు, గౌడు అప్పన్న, గౌడ మల్లేశ్వరరావు, మూగి తవుడు, వాడాన రాజు, గొండేలు తవుడు, జామాన నాయుడు, జామాన మల్లేశ్వరరావు, మారెల ఎర్రయ్యలతోపాటు, కూర్మానాథపురం జన్మభూమి కమిటీ సభ్యుడు పంగ రమణారావు టీడీపీ వీడారు.

ఈ మేరకు కృష్ణదాస్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఆయన పార్టీ జెండాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రమణారావు మాట్లాడుతూ పార్టీలో 20 ఏళ్లుగా ఉండి కష్టకాలంలో కూర్మానాథపురంలో పార్టీ మనగడకు కృషి చేస్తే తగిన గుర్తింపు లేదని వాపోయారు. ఇంకా మరింతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

రామకృష్ణాపురం నాయకులు మాట్లాడుతూ టీడీపీ కోసం కష్టపడిన వారికి కాకుండా, మోసగాళ్లను గుర్తిస్తున్నారని, అందుకే విసిగివేసారి కృష్ణదాస్‌ను సమర్థించేందుకు స్వచ్ఛందంగా చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, తంగి మురళీకృష్ణ,వాన గోపి, ధర్మాన జగన్, తవిటినాయుడు, శ్యామ్, గోవిందరావు, పిట్ట ప్రసాద్, రామారావు, ఆదిబాబు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement