కర్నూలు జిల్లాలో పడగవిప్పిన ఫ్యాక్షన్.. ఇద్దరి హత్య | 2 killed in Kurnool district | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో పడగవిప్పిన ఫ్యాక్షన్.. ఇద్దరి హత్య

Jul 8 2014 7:58 PM | Updated on Sep 2 2017 10:00 AM

పాతకక్షలకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బలవగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ భూతం పడగ విప్పింది. పాతకక్షలకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బలవగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పరి మండలం హలిగిరి గ్రామంలో ఈ దారుణం జరిగింది.

ఈ ముగ్గురు ఆదోని కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement