విశాఖ ఎయిర్పోర్ట్లో 2 కేజీల బంగారం పట్టివేత | 2 kg gold seized in visakhapatnam airport | Sakshi
Sakshi News home page

విశాఖ ఎయిర్పోర్ట్లో 2 కేజీల బంగారం పట్టివేత

Mar 22 2014 12:44 PM | Updated on Aug 25 2018 5:33 PM

దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా నగరానికి తీసుకువచ్చిన ఇద్దరు ప్రయాణికులను విశాఖపట్నం విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా నగరానికి తీసుకువచ్చిన ఇద్దరు ప్రయాణికులను విశాఖపట్నం విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.

 

ఇటీవల కాలంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా విదేశాల నుంచి అక్రమంగా నగరానికి తీసుకువచ్చిన బంగారాన్ని పలువురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement