2 బృందాలుగా ఢీల్లీ వెళ్లనున్న సీమాంధ్ర ప్రతినిధులు | 2 Groups Seemandhra delegates go to Delhi | Sakshi
Sakshi News home page

2 బృందాలుగా ఢీల్లీ వెళ్లనున్న సీమాంధ్ర ప్రతినిధులు

Aug 17 2013 8:36 PM | Updated on Sep 1 2017 9:53 PM

రెండు బృందాలుగా ఢిల్లీ వెళ్లాలని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్: రెండు బృందాలుగా ఢిల్లీ వెళ్లాలని  సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నిర్ణయించుకున్నారు.  సీఎం క్యాంపు ఆఫీసులో వారి సమావేశం ముగిసింది. ఈ నెల 19,20 తేదీల్లో ఆంటోని కమిటీకి తమ వాదనలు వినిపించాలని తీర్మానించారు. సమైక్య రాష్ట్రం మినహా మరో ప్రత్నామ్యాయం లేదన్న నిర్ణయానికి వారొచ్చారు.  

సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. రాజీనామా దిశగా సీమాంధ్ర కేంద్ర మంత్రుల్ని ఒప్పించాలని  నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు తర్వాత ఆంటోని కమిటీని సీమాంధ్రలో పర్యటించాలని కోరనున్నట్లు వారు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement